Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Manchu Vishnu Is Not A Hero

Manchu Vishnu : మంచు విష్ణు హీరో కాదా..!

Published Date :July 11, 2022 , 12:56 pm
By Subbarao N
Manchu Vishnu  : మంచు విష్ణు హీరో కాదా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంచు విష్ణు హీరో కాదా.. అసలు విష్ణుని ఎలా పిలవాలి.. విష్ణు అని పిలవాలా.. లేక హీరో అని పిలవాలా.. అయితే ఈ రెండిటిలో ఎలా పిలిచినా పలికేలా లేడు విష్ణు. మరి ఎలా పిలవాలి అంటే.. జిన్నాగా పిలవాలని చెబుతున్నాడు విష్ణు. ఓ సారి వివరాల్లోకి వెళితే.. చివరగా మోసగాళ్లు మూవీతో మెప్పించలేకపోయిన మంచు విష్ణు.. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత జిన్నా అనే మూవీతో రాబోతున్నాడు. అసలు ఈ టైటిలే పాకిస్థాన్‌ సినిమాను తలపించేలా ఉండడంతో.. అనౌన్స్మెంట్ నుంచి అందరి దృష్టిని ఆకర్షించాడు విష్ణు. సూర్య దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా జిన్నా అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్‌ను గాలి నాగేశ్వరరావు పాత్రను షార్ట్ కట్‌ చేసి జిన్నా అంటూ.. ఇటీవలె కాస్త వెరైటిగా ప్రకటించాడు విష్ణు. అలాగే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే హీరోయిన్లతో కలిసి కొత్తగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు విష్ణు.

ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్‌ కూడా అదే విధంగా.. ఒక మేకింగ్ వీడియోతో విడుదల చేశాడు. డైరెక్టర్ సూర్య, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు మరియు ఫైట్ మాస్టర్ రామకృష్ణన్ షాట్ రెడీ చేసి విష్ణుని పిలుస్తారు. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణు గారు షాట్ రెడీ.. హీరో గారూ షాట్ రెడీ.. అని విష్ణుని ఎంత పిలిచినా పట్టించుకోడు. కానీ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అసలు విషయం చెప్పడంతో.. ‘జిన్నా షాట్ రెడీ’ అనగానే విష్ణు రంగంలోకి దిగడం.. ఆ వీడియోలో చూడొచ్చు. ఇక జిన్నా లుక్‌లో విష్ణు వైట్ అండ్ వైట్ డ్రస్‌లో.. కళ్ళజోడు పెట్టుకొని రఫ్‌గా ఉన్నాడు. ఈ సందర్భంగా.. మాస్, కామెడీ, యాక్షన్.. ఇది జిన్నా భాయ్ స్టైల్ అని విష్ణు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక AVA ఎంటర్‌టైన్‌మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని.. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి జిన్నాగా విష్ణు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Also Read

  • Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
  • Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
  • Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్‌ అప్పుడేనా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 24 Frames Factory
  • AVA Entertainment
  • Eeshaan Surya
  • Ginna
  • manchu vishnu

తాజావార్తలు

  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి

  • BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్

  • Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

  • Astrology: ఏప్రిల్‌ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!

  • LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions