Manchu Mohan babu Fires on Media persons: సినీ నటుడు మంచు మోహన్ బాబు సినిమాల్లో నటనకు ఎంత ఫేమస్ అయ్యారో ఆఫ్ స్క్రీన్ లో వివాదాలతో కూడా అంతే ఫేమస్ అయ్యారు. నటుడిగానే కాక నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు కాలం కలిసి రాకపోవడంతో సినిమాల మీద ఫోకస్ తగ్గించి తన మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఫోకస్ పెట్టారు. ఆయన చివరిగా చేసిన సన్ ఆఫ్ ఇండియా దారుణమైన డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయినా, కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న చేస్తున్న అగ్ని నక్షత్రం అనే సినిమాలో భాగం అవుతున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా షాద్ నగర్ లో మంచు మోహన్ బాబు బిహేవియర్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏమిటంటే మోహన్ బాబు షాద్ నగర్ లో మీడియాపై కాసేపు చిర్రుబుర్రులాడుతున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Pawan Kalyan: జనసేన టీడీపీకి బీ టీమ్ అనడంపై స్పందించిన పవన్
ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లి ఆయనను ఫొటోలు, వీడియోలు తీయడమే కాదు మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటి వరకు ప్రశాంతంగానే ఉన్న మోహన్ బాబు మీడియాను చూడగానే ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అంతేకాక ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బౌన్సర్లకు సూచించడమే కాదు బుద్ధి లేదా?, బుద్ధి లేదా? ఈ జర్నలిస్టులకి అంటూ తన నోటికి పని చెప్పారు. ఇక మోహన్ బాబు షాద్ నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉన్న తన ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాల నిమిత్తము అక్కడకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఉండాలని ఆయన అనుకున్నా మీడియా ప్రతినిధులు వచ్చి చుట్టుముట్టి ఫొటోలు వీడియోలు తీయడంతో ఆయన వారిపై ఫైర్ అయ్యారు. ఇక మీడియాపై మోహన్ బాబు ఫైర్ అయిన వ్యవహారం హాట్ టాపిక్ అయింది.