Samantha Getting Trolled Brutally: నేటి సోషల్ మీడియా యుగంలో నోరు జారడం ఎంత ప్రమాదమో ట్వీట్లు, పోస్టులు జారడం కూడా అంతే ప్రమాదం.. ఎందుకంటే ఇప్పుడు చేసే కామెంట్లు కొన్నేళ్ల తరువాత కూడా మనని ఇబ్బంది పెట్టొచ్చు. ఇప్పటికే చాలా మంది ఇలా ఎప్పుడో చేసిన కామెంట్ల వల్ల ఇబ్బంది పడగా ఇప్పుడు సమంత ఆ లిస్టులో చేరింది. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆరాధ్య’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇక ఈ సాంగులో విజయ్, సమంత కెమిస్ట్రీ బాగా పండిందని, సాంగ్ పిక్చరైజేషన్, లిరిక్స్, ట్యూన్స్ చాలా బాగున్నాయని చూసిన వారంతా అంటున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు సమంతకు ఈ సాంగులోని ఒక షాట్ తలనొప్పిగా మారింది. అసలు విషయం ఏంటంటే గతంలో సమంత చేసిన ఓ ట్వీట్ కు ఈ పాటలోని ఓ పోస్టర్ కు లింకు పెడుతూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ‘ఆరాధ్య’ పాటలో ఓ చోట సమంత కుడి చేతిని విజయ్ దేవరకొండ కాలితో తంతున్నట్టుగా ఒక షాట్ ఉంది. ఇంకేముంది ఆ స్క్రీన్ షాట్ ను ఆధారం చేసుకుని కొందరు నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు. సమంత గతంలో “ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను, నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి” అని రాసుకొచ్చింది. ఆమె మెన్షన్ చేయకున్నా అది ‘వన్- నేనొక్కడినే’ పోస్టర్ అని అందులో మహేష్ కాళ్ల దగ్గర హీరోయిన్ ఉన్నట్లు చూపిస్తారని దానికి ఆమె కౌంటర్ గా ట్వీట్ చేసిందని అంటున్నారు. అంతేకాక ఇప్పుడు ఆ ట్వీట్ ని, ‘ఖుషి’ ఫొటోని పక్కపక్కన పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక ‘ఖుషీ’ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చిన టైటిల్ పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకోగా సినిమా మీద అంచనాలు కూడా పెరుగుతున్నాయి.