Manoj Bajpayee: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ హీరో’ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Bajpayee: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను మోసం చేశాడని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఆరోపించాడు. తనను హీరోగా చేస్తానని చెప్పి సెకండ్ రోల్ ఇచ్చి అన్యాయం చేశాడని చెప్పుకొచ్చాడు. ఇప్పుడంటే.. వర్మ.. చెత్తచెత్త సినిమాలు తీస్తున్నాడు కానీ, ఒకప్పుడు వర్మ వేరు.. ఆయన తీసిన సినిమాలు వేరు. గ్యాంగ్ స్టర్, మాఫియా, దెయ్యాల సినిమాలు తీయాలంటే వర్మ పేరే చెప్పుకొనేవారు. ఇక వర్మ తీసిన మంచి చిత్రాల్లో సత్య ఒకటి. జెడి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్, ఊర్మిళ మండోద్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా చేసిన మనోజ్ బాజ్ పాయ్ కు మంచి గుర్తింపే లభించింది. అయితే మొదట మనోజ్ ను కలిసినప్పుడు వర్మ హీరోగా అనుకున్నాడట.. ఆ విషయాన్నీ అయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Prabhas: మాకు ఆ లుంగీ లుక్కే కావాలి..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
” సత్య సినిమాలో పరేష్ రావల్ గ్యాంగ్ లో మెయిన్ రోల్ కోసం ఒకరిని వెతుకుతున్నారు అని తెలిసి వెళ్ళాను. వర్మను కలిసినప్పుడు ఆయన నన్ను.. అంతకుముందు ఏఏ సినిమాలు చేసావ్ అని అడిగాడు. నేను మహేష్ భట్ సినిమాలో ఒక కీలక పాత్ర చేశాను.. ఆ తరువాత బందిత్ క్వీన్ చేశాను అని చెప్పగానే ఆయన ముఖం వెలిగిపోయింది.బందిత్ క్వీన్ అంటే వర్మకు చాలా ఇష్టమట. ఆ సినిమాలోని నా పాత్ర గురించి చెప్పగానే అదినువ్వేనా .. బయట చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నావు అని అడిగారు. ఆ తరువాత నీకోసమే నేను 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను.. నువ్వే నా హీరో అని చెప్పి.. మరే సినిమా ఒప్పుకోవద్దని అన్నాడు. అప్పటికే నేను దౌడ్ అనే సినిమా మధ్యలో ఉన్నాను. దానిని పూర్తిచేసి వర్మ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను. ఒకరోజు వర్మ ఫోన్ చేసి.. నేను సినిమాలో సెకండ్ హీరో అని చెప్పాడు. నా హృదయం ముక్కలైంది. నన్ను వర్మ మోసం చేశాడు.. హీరో అని చెప్పి సెకండ్ రోల్ అంటకట్టాడు అని కోపం వచ్చి ఆయన దగ్గరకు వెళ్లి అడిగేశాను . ఇక వర్మ.. నన్ను కూర్చోపెట్టి.. హీరోలు ఎవరైనా దొరుకుతారు.. కానీ బికూ మాత్రే పాత్రకు మాత్రం ఒక గొప్ప వ్యక్తి కావాలి చెప్పాడు. ఇక ఆ తరువాత షూటింగ్ లో కానీ, సినిమా రిలీజ్ అయ్యాకా కానీ ఆ పాత్రకు చాలా ప్రశంసలు వచ్చాయని ” ఆయన తెలిపారు. సత్య సినిమా తరువాతే మనోజ్ బాజ్ పాయ్ సినీ కెరీర్ మలుపు తిరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఆయన ది ఫ్యామిలీ మ్యాన్ 3 లో నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!