RGV Den: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్న వర్మ.. బయోపిక్ లు తీసే పని మీద పడ్డాడు. ఇంకోపక్క నిజం అనే యూట్యూబ్ ఛానెల్ ను పెన్ చేసి.. అందులో నిజానిజాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డాడు. ఇక తాజాగా వర్మ.. ఒక కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేశాడు. దానికి ఆర్జీవీ డెన్ అని పేరు పెట్టి.. తనకు నచ్చినట్లు తయారుచేసుకున్నాడు. రెండంతస్తుల ఈ భవనం మొత్తం చూడడానికి అచ్చు డెన్ లానే ఉంది. ఇక తన డెన్ ను టూర్ ను చేసి యూట్యూబ్ లో షేర్ చేశాడు.. భవనం మీదనే ఆర్జీవీ డెన్ అని రాసి ఉండడం విశేషం. లోపలి వెళ్ళగానే.. ఆర్జీవీ.. తాను పనిచేసిన సెలబ్రిటీలతో దిగిన ఫోటోలు కనిపిస్తాయి. చుట్టూ చెట్లు.. మధ్యలో ఆర్జీవీ కోట్స్.. హీరోయిన్స్ బికినీ ఫొటోలతో డెన్ కిందభాగం ఉంది.
Anasuya: వాడు ఆంటీ అని పిలిస్తే కమ్మగా ఉంది..
జయసుధ, శ్రీదేవి తో పాటు అందమైన హీరోయిన్లు.. ఆయన దర్శకత్వంలో పనిచేసిన హీరయిన్లందరి ఫొటోలు కనిపిస్తాయి. ఇక ఈ డెన్ మొత్తంలో హైలైట్ ఏదైనా ఉంది అంటే.. అది ఆర్జీవీ రూమ్ అని చెప్పుకోవాలి. విశాలమైన పెద్ద రూమ్ లో చుట్టూ నగ్న హీరోయిన్ల ఫోటోలు.. పెద్ద సోఫా సెట్.. మధ్యలో టీవీ.. ఇక పెద్ద చైర్ లో డెవిల్ వర్మ. అసలు ఆ ఫోటోలు చూస్తే .. ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. ఆ యాంగిల్స్.. అమ్మాయిల నగ్న ఫొటోలతో అది రూమ్ లా లేదు.. పోర్న్ హబ్ లా ఉందని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇంకొంతమంది. మనిషి అన్న తరువాత కూసింత కళాపోషణ ఉండాలి. వర్మలో ఈ రేంజ్ కళాపోషణ ఉంటుందని అనుకోలేదని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ డెన్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.