Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చిన బాలయ్య.. కుటుంబంతో కలిసి వెకేషన్ కు బయల్దేరాడు. బాలకృష్ణ, భార్య వసుంధర, మనవడితో బాలయ్య అమెరికాకు పయనమయ్యాడు. నేడు ఎయిర్ పోర్టులో మనవడితో బాలయ్య సందడి చేశాడు. చిన్న కూతురు తేజస్విని కొడుకు చెయ్యి పట్టుకొని సరదగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్న బాలయ్య వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దాదాపు ఒక వారం రోజులు వెకేషన్ లోనే ఉండనున్నాడట బాలయ్య.
Salaar: ‘సలార్’ టీజర్లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా?
ఇక ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టిన బాలకృష్ణ.. ఈసారి భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి కామెడీ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొట్టమొదటి సారి బాలయ్యతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో బాలకృష్ణ మరో హిట్ ను అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది తెలియాలి.