Manchu Lakshmi:మంచు మోహన్ బాబు గురించి, మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు, ట్రోలింగ్ విషయంలో మంచి కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయని, మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదమ్ముల అన్న తర్వాత గొడవలు ఉండవా..? అని మోహన్ బాబు చెప్పడంతో నిజమే అనుకొని అభిమానులు లైట్ తీసుకున్నారు. కానీ, ఎప్పటికప్పుడు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు అభిమానులకి తెలుస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అక్క లక్ష్మీ ని కూడా విష్ణు దూరం పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు నెటిజెన్లు. మోహన్ బాబు మొదటి భార్య కుమారుడు, కుమార్తె మంచు విష్ణు, మంచు లక్ష్మీ అన్న విషయం అందరికీ తెలిసిందే. మంచు మనోజ్ రెండో భార్య కుమారుడు. మొదటి నుంచి కూడా ఈ ముగ్గురు కలిసి మెలిసి ఒక తల్లి బిడ్డల్లానే ఉండేవారు. పెళ్లిళ్లు అయిన తర్వాత ఎవరికి వారు సపరేట్ గా ఉండడం మొదలుపెట్టారు. ఇక మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లితో.. విష్ణుకి, మనోజ్ కి పెద్ద గొడవ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ.. మనోజ్ ప్రేమను అర్థం చేసుకొని ఆమె పెద్దదిక్కుగా ఉండి.. మోహన్ బాబుని ఒప్పించి వారిద్దరికీ పెళ్లి చేసింది. ఈ విషయంలో మనోజ్, లక్ష్మీకి ఎప్పుడు కృతజ్ఞుడుగా ఉంటానని చెప్పుకొచ్చాడు.
Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?
తాజాగా రాఖీ రోజున లక్ష్మీ కేవలం మనోజ్ కుటుంబంతోనే సమయాన్ని గడిపినట్లు తెలుస్తుంది. మనోజ్ కి రాఖీ కట్టడం, కుటుంబంతో కలిసి వారు బయటికెళ్ళడం ఆ ఫోటోలను మనోజ్ షేర్ చేశాడు. ప్రతి సంవత్సరం లక్ష్మీ ఇద్దరు తమ్ముళ్లకు రాఖీ కట్టి ఫోటోలను షేర్ చేసేది.. కానీ, ఈసారి మాత్రం కేవలం మనోజ్ కి మాత్రమే కట్టడంతో విష్ణుకి ఎందుకు కట్టలేదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే విష్ణు విదేశాల్లో ఉన్నాడని.. అందుకనే లక్ష్మీ రాఖీ కట్టలేక పోయిందని మరో వార్త కూడా వినిపిస్తుంది. ఇంకొంతమంది మనోజ్ కు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకే లక్ష్మీని కూడా విష్ణు దూరం పెట్టాడని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ మంచు కుటుంబంలో విభేదాలు మాత్రం ఉన్నాయని ఈ విషయాల వల్ల తెలుస్తుంది. మరి ముందు ముందు ఈ అక్క తమ్ముళ్లు ఎలా ఉండబోతున్నారో చూడాలి.