మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేశారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి తన సైన్ స్క్రీన్స్ బ్యానర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా టీం. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే యాంకర్ సుమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ లైవ్ ఇప్పుడు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూసేయండి.