Manju Warrier : ఈ నడుమ హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లకు వెళ్తే.. అక్కడ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. వారి మీద కావాలని కొందరు చేతులు వేయడం.. లేదంటే వారి ప్రైవేట్ పార్ట్స్ మీద అసభ్యకరంగా తాకడం లాంటివి కూడా చూస్తున్నాం. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు కూడా ఇలాంటి సమస్యనే ఎదురైంది. ఆమె ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. మలయాళంలో ఆమెకు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్ కు కూడా లేదు. తిరుగులేని ఫాలోయింగ్ ఆమె సొంతం. అయితే రీసెంట్ గా ఆమె బెంగుళూరులో ఓ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్లింది. ఆమెను చూసేందుకు వందలాది మంది వచ్చారు.
Read Also : Tollywood Stars : షూటింగ్స్ కు బ్రేక్.. రెస్ట్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్లు
దీంతో కారుమీదనే నిలబడి ఆమె అందరికీ అభివాదం చేస్తున్న టైమ్ లో.. ఓ పోకిరీ జనం మధ్యలో నుంచి ఆమె నడుము గిల్లాడు. దాంతో ఆమె ఒకింత షాక్ కు గురైంది. అతను ఎవరు అనేది ఆ జనాల్లో సరిగ్గా కనపించట్లేదు. కానీ ఆమె మాత్రం దాన్ని హైలెట్ చేయకుండా అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన వారంతా సదరు వ్యక్తిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక హీరోయిన్ ను అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుందని.. ఎలాంటి ఎక్స్ పోజింగ్ పాత్రలు కూడా చేయని ఆమె మీద.. ఇలాంటి ఘటన బాధాకరం అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మంజు రీసెంట్ గా రజినీకాంత్ తో వేట్టయాన్ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఎల్-2 ఎంపురాన్ లో కూడా నటించింది.
Read Also : HIT 3: ఆ లాజిక్ శైలేష్ మిస్సవలేదు బాసూ!
People 😡🙏 #ManjuWarrierpic.twitter.com/b2nfTau96B
— Prince in Exile || దారి తప్పిన బాటసారి.. .. .. (@ExilePrince_555) May 2, 2025