Tollywood Stars : టాలీవుడ్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే వీళ్లు.. సమ్మర్ హీట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్లు అయిన మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ప్రస్తుతం సమ్మర్ టూర్ లో జాలీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూట్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతోంది. ఈ షూట్ కు బ్రేక్ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్నాడు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడు. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ లో పాల్గొంటాడు.
Read Also : HIT 3: ఆ లాజిక్ శైలేష్ మిస్సవలేదు బాసూ!
కాస్త గ్యాప్ దొరికితే టూర్లు వేసేయడంలో మహేశ్ ముందు వరుసలో ఉంటాడు. అసలే రాజమౌళితో సినిమా. ఒకసారి ఆ ప్రపంచంలో అడుగు పెడితే బ్రేక్ ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియదు. అందుకే దొరికిన టైమ్ ను బాగా వాడేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి కాస్త బ్రేక్ ఇవ్వడంతో ఫ్యామిలీతో టూర్ వేసేశాడు. ఇంకోవైపు అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో బన్నీ కూడా ట్రిప్ వేసేశాడు. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీగా గడిపేసిన ప్రభాస్.. ఇప్పుడు ఇటలీకి వెళ్లిపోయాడు. అక్కడ ఓ విలేజ్ లో సేదదీరుతున్నాడు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రశాంత్ నీల్ షూట్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఓ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందంట. అది అయ్యాక జూనియర్ కూడా ట్రిప్ వేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Nani : హిట్-3 రెండు రోజుల కలెక్షన్స్ ఇవే..