కేజీఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ నుండి వస్తున్న నెక్ట్స్ ఫిల్మ్ టాక్సిక్. మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఏడాది క్రితం బర్త్ డే పీక్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన టీం తర్వాత ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. యశ్ హీరో, గీతూ మోహన్ దాస్ దర్శకురాలు అన్న విషయం తప్పితే మిగిలిన క్రూ సమాచారం లేదు. ఇక తాజాగా వన్ బై వన్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది టీం. నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. తాజాగా యశ్ బర్త్ డేకు స్పెషల్ వీడియోను వదిలారు మేకర్స్.
Also Read : JanaNayagan : మరో మలుపు తిరిగిన విజయ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కధ…
టీజర్ ఇలా వచ్చిందో లేదో హీరో కన్నా దర్శకురాలు టార్గెట్ అయ్యింది. గతంలో ఆమె కసాబా అనే సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలే దీనికి రీజన్. 2016లో మమ్ముట్టి హీరోగా నితిన్ రేంజీ పానికర్ దర్శకత్వంలో కసాబా అనే ఫిల్మ్ వచ్చింది. అందులో హీరో.. తోటి మహిళా పోలీసాఫీసర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు రాగా, గీతూ మద్దతు తెలిపింది. కానీ ఇప్పుడు టాక్సిక్‌లో యశ్.. ఓ అమ్మాయితో ఇంటిమేట్ సీన్ చూసిన మమ్ముట్టి ఫ్యాన్స్ ఇదేనా స్త్రీకి ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు లాస్ట్ ఇయర్ యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన వీడియోను ఎత్తి చూపుతూ స్త్రీ పట్ల ద్వేషాన్ని దర్శకురాలు సవరించారంటూ గీతూకు సెటైరికల్ కౌంటరిచ్చేశాడు.. అయినా కూడా మమ్మూక ఫ్యాన్స్ ఆమెను విడిచిపెట్టడం లేదు. హీరోను ఓవర్ ఎలివేషన్ ఇస్తూ.. ఓ అమ్మాయిని వస్తువుగా యూజ్ చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. టీజర్‌కు మాలీవుడ్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంటే.. టాలీవుడ్ దర్శకులు మాత్రం ఆమెను పొగిడేస్తున్నారు.