మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రెడిబిలిటీ ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకీ లేదు. కంటెంట్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోలు కూడా నటించి ఏకైక ఇండస్ట్రీ కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఏ చిత్ర పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు ఏడాది ఒక సినిమా చేస్తాడు, రెండు చేస్తూ గొప్ప ఇక మూడు సినిమాలు చేస్తే ఆకాశానికి ఎత్తేయొచ్చు. మలయాళంలో మాత్రమే స్టార్ హీరోలు ఇప్పటికీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తున్నారు. యంగ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు సీనియర్ స్టార్ హీరోలు, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఏడాదికి అయిదు సినిమాలకి పైగా చేస్తున్నారు అంటే అక్కడ ఇండస్ట్రీ ఎంత హెల్తీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సీనియర్ సూపర్ స్టార్ హీరోల్లో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉండే వాళ్లలో మముట్టి టాప్ ప్లేస్ లో ఉంటాడు. మోహన్ లాల్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడు కానీ ప్రస్తుతం మోహన్ లాల్ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడంతో ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి. మమ్ముట్టి మాత్రం కథ నచ్చితే సినిమా చేసేస్తున్నాడు.
2022లో అయిదు సినిమాలని రిలీజ్ చేసిన మమ్ముట్టి, 2023 స్టార్ట్ అయ్యి నెల రోజులు మాత్రమే అయ్యింది అప్పుడే తన కొత్త సినిమాని రిలీజ్ చేశాడు. ‘క్రిస్టోఫర్’ అనే కాప్ డ్రామా సినిమాలో మమ్ముట్టి నటించాడు. ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 2023లో వస్తున్న మొదటి స్టార్ హీరో సినిమాగా ‘క్రిస్టోఫర్’ నిలిచింది. ఇండస్ట్రీకి 2023లో మమ్ముట్టి సాలిడ్ ఓపెనింగ్స్ ఇస్తాడని అక్కడి ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోస్ లో క్రిస్టోఫర్ సినిమాని చూసిన వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మమ్ముట్టి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మమ్ముట్టీని చూసి మిగిలిన ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ హీరోలు కూడా త్వరగా సినిమాలు చెయ్యడం నేర్చుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మనీ రొటేట్ అవుతాయి, ఎక్కువ సినిమాలు బయటకి వస్తాయి, ఎక్కువ మందికి పని దొరుకుతుంది.