Director Harikumar Passed Away: సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యకాలంలో పలువురు నటీనటులు టెక్నీషియన్లు మృత్యువాత పడ్డారు ఇప్పుడు మరోసారి మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాద పరిస్థితి ఏర్పడ్డాయి. సినీ దర్శకుడు, కథా రచయిత హరికుమార్ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం. సుకృతం, ఉద్యానపాలకన్, స్వయంవరపంథాల్, ఎజున్నల్లాట్ సహా 18 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మొదటి చిత్రం అంబల్ పూ, 1981లో విడుదలైంది.
Samantha: బాత్ టబ్ ఫొటోలు వైరల్.. సమంత కీలక వ్యాఖ్యలు?
ఇక ఎం. టి. వాసుదేవన్ నాయర్ స్క్రీన్ ప్లే అందించగా హరికుమార్ డైరెక్ట్ చేసిన ‘సుకృతం’ అందరి దృష్టిని ఆకర్షించింది. మమ్ముట్టి -గౌతమి నటించిన సుకృతం ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. సద్గమయ, అన్‌టోల్డ్ స్టోరీస్, పులర్‌వేతం, స్వయంవరపంటల్, ఉద్యానపాలకన్, సుకృతం, ఎజున్నల్లాట్, ఉజం, జలకం, పులి వానినే పులి, అయనం, ఒక ప్రైవేట్, ప్రేమించే మీరా. అంబల్ పూవ్ లాంటి సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. 40 సంవత్సరాల వ్యవధిలో తీసిన మొత్తం 18 సినిమాలు విభిన్న నేపథ్యాలను కలిగి ఉంటాయి. ఇక సూరజ్ వెంజరమూడ్ – అన్నే అగస్టిన్ నటించిన ఆటో-రిక్షాకరంటే భార్య (2022) ఆయన డైరెక్ట్ చేసిన చివరి సినిమా.