Mary: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు హీరోలవుతారు.. ఎవరు జీరలు అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్లుగా వెలుగొందిన వారు దీన స్థితిలో మరణించడం ఎంతోమందిని చూశాం. అవకాశాలు లేక అడ్డదాలు తొక్కినవారి గురించి విన్నాం. ఇక ఆశలు లేక వేరే ఉద్యోగాలలో సెటిల్ అయినవాళ్లను చూసాం.. తాజాగా ఒకప్పుడు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఒక నటి అవకాశాలు లేక పొట్టకూటి కోసం రోడ్డుపై లాటరీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది నటి మేరీ. 2016లో యాక్షన్ హీరో బిజు మూవీతో తెరపైకి వచ్చింది మేరీ.
తమిళ్, మలయాళ, కన్నడ సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచిపేరు తెచ్చుకొంది. ఇక ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆమె జీవితం మొత్తం తలక్రిందులయ్యింది. కరోనా పోయినా ఆమెకు మాత్రం తిప్పలు తప్పలేదు. అవకాశాలు లేవు.. చేతిలో డబ్బులు లేవు.. కడుపు నింపుకోవడానికి ఏ పనైనా చేయాలి అని చెప్పి రోడ్డుపై లాటరీ టికెట్స్ అమ్మడం మొదలుపెట్టింది. ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి.. సాయంత్రం వరకు రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్మితే రూ.300 వరకు సంపాదన ఉంటుందని.. దాంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తునట్లు చెప్పుకొచ్చింది. ఆమె దయనీయ స్థితిని చూసి ఎవరైనా అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.