Actor Surabhi Santhosh Marries Singer Pranav Chandran: మలయాళ నటి సురభి సంతోష్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. సురభి భర్త బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్. ఇక వీరి వివాహ వేడుకలోని ముఖ్యమైన ఘట్టాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సరిగమ లేబుల్ ఆర్టిస్ట్ అయిన ప్రణవ్ ముంబైలో పుట్టి పెరిగాడు. అయితే అతని స్వస్థలం మాత్రం కేరళలోని పయ్యన్నూరు. కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి నిశ్చయించగా గత నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. సురభి సంతోష్ నటి కాకుండా మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ అలాగే లాయర్ కూడా.
Kona Venkat: గీతాంజలి పిల్లలను చూసి చలించిన కోన వెంకట్.. సొంత కుమార్తెల్లా చూసుకుంటానని భరోసా!
2018లో విడుదలైన కుంచాకో బోబన్ ‘కుట్టనాదన్ మార్పాప’తో సురభి సినీ రంగ ప్రవేశం చేసింది. హీరోయిన్ చెల్లెలి పాత్రలో సురభి ఆ సినిమాలో నటించింది. తర్వాత పలు చిత్రాల్లో నటించిన సురభి చివరకు ధ్యాన్ శ్రీనివాసన్ సరసన ‘ఆప్ కైసా హో’ చిత్రంలో నటించింది. సన్నీ వేన్ నటించిన ‘త్రయం’ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇంద్రజిత్ సుకుమారన్ దర్శకత్వంలో అనురాధ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఇక సురభి మలయాళంతో పాటు కన్నడ, తమిళ భాషల్లోనూ నటించింది. దుష్ట సినిమాతో కన్నడలో అడుగు పెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించింది. సురభి న్యాయవాది కూడా కావడంతో ఎక్కువగా ఆమె సినిమాల్లో నటించదు. గత ఏడాది నవంబర్‌లో సురభి తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది