Actor Surabhi Santhosh Marries Singer Pranav Chandran: మలయాళ నటి సురభి సంతోష్ సైలెంటుగా పెళ్లి చేసుకున్నారు. సురభి భర్త బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్. ఇక వీరి వివాహ వేడుకలోని ముఖ్యమైన ఘట్టాలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సరిగమ లేబుల్ ఆర్టిస్ట్ అయిన ప్రణవ్ ముంబైలో పుట్టి పెరిగాడు. అయితే అతని స్వస్థలం మాత్రం కేరళలోని పయ్యన్నూరు. కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి నిశ్చయించగా గత నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.…