Kollam Sudhi: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kollam Sudhi: చిత్ర పరిశ్రమకు ఏదో తెలియని శని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి.. ఇండస్ట్రీలోని వారు అయితే గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ వెకేషన్ నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఇంకా ఈ ఘటనను అభిమానులు మరిచిపోకముందే మరో ఘోర రోడ్డుప్రమాదంలో నటుడు మృతి చెందాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. పలు మలయాళ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు కొల్లం సుధీ. తన స్నేహితులతో కలిసి ఆయన వస్తున్న కారు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.
Shaitan Trailer: ఛీఛీ.. పచ్చి బూతులు.. పోర్న్ సినిమాలు తీసుకో పో
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
కొల్లం సుధీ, అతని స్నేహితులు బిను ఆదిమాలి, మహేష్, ఉల్లాస్ తో కలిసి పటకార ప్రాంతంలో జరిగిన ఒక ఈవెంట్ కు వెళ్లారు. ఈవెంట్ ను ముగించుకొని తెల్లవారు జామున కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో వారు కారును ఒక కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ కొద్దిదూరంలో వెళ్ళిపడింది. ఈ ప్రమాదంలో సుధీ తలకు తీవ్ర గాయమైంది. ఇక స్నేహితులు వెంటనే పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా.. ప్రాణాలతో పోరాడుతూ సుధీ కన్నుమూశారు. మిగిలిన ముగ్గురు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సుధీ వయస్సు 39. మంచి భవిష్యత్తు ఉన్న ఆయన ఇంత చిన్న వయస్సులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!