నేలటిక్కెట్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హాట్ బ్యూటీ మాళవిక శర్మ. మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ఈ సినిమా తరువాత రామ్ సరసన రెడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా అమ్మడు బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీచ్ ఒడ్డున బ్లాక్ బికినీ లో మాళవిక అందాలు అదిరిపోయాయి.
ఉదయాన్నే సూర్యుడి కిరణాల నుంచి వచ్చే వేడిని ఆస్వాదిస్తూ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల కళ్ళను తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఇక ఈ ఫొటోకు కాలి వేళ్లు ఇసుకలో.. సూర్యుడు ముక్కును ముద్దాడుతున్నప్పుడు అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసింది. ఇక ఈ ఫొటోకు ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ సూర్యుడిని నేను అయితే ఎంత బావుండు.. అని కొందరు.. బీచ్ఒడ్డున బికినీలో ఇలా అందాలను ఆరబోస్తుంటే కుర్రాళ్ళు చూసి తట్టుకోవడం కష్టం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.