Malavika Mohanan Talks About Her Roles In Movies: పారితోషికం కాస్త ఎక్కువగా ముడితే చాలు.. కథ, పాత్రల్ని పట్టించుకోకుండా చాలామంది నటీనటులు వెంటనే సినిమా ఆఫర్లను ఒప్పేసుకుంటారు. ఇంటర్వ్యూల్లో తాము కథ, పాత్రలు బాగుంటేనే సినిమాలు ఒప్పుకుంటామని మాటలు అల్లేస్తుంటారు కానీ.. గట్టిగా డబ్బులు అందితే మాత్రం, గుడ్డిగా సంతకాలు పెట్టేస్తుంటారు. కానీ.. తాను అలా కాదని, పాత్రలకు ప్రాముఖ్యత ఉండే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానని మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ పేర్కొంది. అది రూ.500 కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ సినిమా అయినా సరే.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే, అందులో నటించడానికి అంగీకరించనని తెగేసి చెప్పింది. ఎందుకంటే.. అలాంటి సినిమాలు సూపర్ హిట్ అయినా, తన పాత్రకు గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చింది.
Jennifer Mistry: సెట్‌లో అవమానించారు, నీళ్ల కోసం ఆ దుస్థితి.. లైవ్‌లోనే ఏడ్చేసిన నటి
కాగా.. తొలుత మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన మాళవిక మోహనన్, 2013లో ‘పట్టం బోల’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక అప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టులు చేసుకుంటూ.. కెరీర్‌లో దూసుకెళ్తోంది. నిజానికి.. తనకు చాలా ఆఫర్లు వస్తున్నా, ఈ అమ్మడు ఏరికోరి తనకు నచ్చిన సినిమాలనే చేస్తోంది. విజయ్ సరసన మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్ సినిమాల్లో నటించి.. మంచి పాపులారిటీ గడించింది. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రంలో విక్రమ్‌తో మాళవిక జతకట్టింది. ఈ సినిమాపై మాళవిక చాలా ఆశలే పెట్టుకుంది. మరోవైపు.. తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ, ఈ భామ నిత్యం వార్తల్లోకెక్కుతోంది.
LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర