థ్రిల్లర్ సినిమాలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం సస్పెన్స్ ఎలిమెంట్ ని క్లామక్స్ వరకూ హోల్డ్ చేయడం. ఆ సస్పెన్స్ ని ఎంత వరకూ రివీల్ చేయకుండా కాపాడుకుంటూ వస్తే, ఆడియన్స్ అంతగా సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే క్లైమాక్స్ రివీల్ అయ్యిందో అక్కడి నుంచి ఆడియన్స్ కి ఇక సినిమా అయిపోయిందిలే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సస్పెన్స్ రివేల్ అయిన కాసేపటికే ఆ సినిమా ఎండ్ అయిపోవాలి అప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుడు లాగ్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా సినిమా నుంచి బయటకి వస్తాడు. పొరపాటున సస్పెన్స్ ని రివీల్ చేశాక కొంచెం సాగదీసినట్లు అనిపించినా, ప్రేక్షకుడు సీటులో ఇబ్బందిగా కూర్చుంటాడు. అందుకే థ్రిల్లర్ సినిమాలకి సస్పెన్స్ ని హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ జానర్ లో ఆడియన్స్ ముందుకి రానున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి రాబోతోంది.
‘హిట్ 2’ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అయ్యింది. మంచి అడ్వాన్స్ బుకింగ్స్ రాబడుతున్న ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలని చంపుతూ ఉంటాడు. దాన్ని ఒక పోలిస్ ఆఫీసర్ ఎలా ఆపాడు? ఆ కిల్లర్ ఎవరు? అతన్ని పోలిస్ పట్టుకోని కేసు క్లోజ్ చేశాడా లేదా అనేది ‘హిట్ 2’ కథ. ఈ కథలో మెయిన్ పాయింట్, కిల్లర్ ఎవరు అనే ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎంత లేట్ గా చెప్తే, ‘హిట్ 2’ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. అయితే ఒక ట్వీట్ పుణ్యమాని సోషల్ మీడియాలో ‘హిట్ 2’ మేజర్ సస్పెన్స్ గురించి ఒక లీక్ బయటకి వచ్చింది. “హిట్ 2 సినిమాలో మా ఫ్రెండ్ ఒకడు పోలిస్ పాత్రలో నటించాడు, అతను చెప్పిన దాని ప్రకారం హీరోయిన్ మీనాక్షీ చౌదరీనే సైకో కిల్లర్. ఇదే హిట్ 2లో సస్పెన్స్ ఎలిమెంట్” అంటూ ఒకరు ట్వీట్ చేసి షాక్ ఇస్తే, ‘హిట్ 2’ సినిమాలో హీరోయినే సైకో, ఆమెనే అందరినీ చంపుతూ ఉంటుంది. కావాలంటే ట్రైలర్ లో చూపించిన పల్లగాట్లని చూడండి, అవి అచ్చం హీరోయిన్ మీనాక్షీ చౌదరి పల్ల లాగానే ఉంటాయి అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసిన హీరో అడవి శేష్, “నిజం బ్రో, నమ్మండి” అంటూ ఎటకరంగా రిప్లై ఇచ్చాడు. ఒకవేళ నిజంగానే ‘మీనాక్షీ చౌదరీ’ కిల్లర్ అయితే, థియేటర్ లో చూసే ఆడియన్స్ కి ‘ఈ విషయం మాకు ముందే తెలుసు’ అనే ఫీలింగ్ వస్తుంది. సినిమా చూసే సమయంలో కూడా హీరోయిన్ ని కిల్లర్ అనే కోణంలోనే అబ్సర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మీనాక్షీ చౌదరీ కాకుండా ఇంకొకరు కిల్లర్ అనే ట్విస్ట్ ఇస్తే మాత్రం ‘హిట్ 2’ టీం ఆడియన్స్ ని షాక్ ఇచ్చినట్లే. మరి అందరూ అనుకుంటున్న విషయాన్ని తప్పు అని ప్రూవ్ చేసి, హిట్ 2 చిత్ర యూనిట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందేమో చూడాలి.