Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!
టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మహి వి. రాఘవ్. ‘ఆనందో బ్రహ్మ’తో హారర్ కామెడీలో కొత్త ఒరవడి సృష్టించినా, ‘సేవ్ ది టైగర్స్’తో నవ్వుల పువ్వులు పూయించినా ఆయన స్టైల్ వేరు. తాజాగా ఆయన తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఓం శాంతి డిస్కో శాంతి’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషులను భయపెట్టడం చూస్తుంటాం. కానీ, ఈ సినిమాలో కథాంశం వెరీ వెరీ స్పెషల్! అసలు భయం అంటే ఏంటో తెలియని కొందరు ‘పిచ్చివాళ్లు’ దెయ్యాలకు ఎదురైతే ఎలా ఉంటుంది? ఆ పిచ్చివాళ్ల చేష్టలకు దెయ్యాల పరిస్థితి ఏంటి? అనే సరికొత్త కోణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
Also Read :Babu Mohan : పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు!
పిచ్చివాళ్లను చూసి దెయ్యాలే జడుసుకునే లెవల్లో ఈ స్పూకీ కామెడీ ఉండబోతోంది. జంప్ స్కేర్లు, కడుపుబ్బ నవ్వించే డైలాగులు, అనూహ్యమైన ట్విస్టులతో ఒక గందరగోళమైన ఫన్ జర్నీ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో ఈ వినోదాల విందును థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహి వి. రాఘవ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోగు ఆర్.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి, ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత మహి వి. రాఘవ్ మార్క్ హారర్ కామెడీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘ఓం శాంతి డిస్కో శాంతి’ అసలైన ట్రీట్ ఇవ్వబోతోందని అర్థమవుతోంది.
తాజావార్తలు
-
Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!
-
Lenskart controversy: ఒక్కరోజే లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?
-
Phone Snatching: హైదరాబాద్‌లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
-
Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
-
Babu Mohan : పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు!
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!