Babu Mohan : పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్’కి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ ప్రఖ్యాత రేలంగి అవార్డు అందించిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బాబు మోహన్ మాట్లాడుతూ ”ప్రజాస్వామ్యం పుట్టిన తరువాత లేబర్ యాజమాన్య మంత్రిగా చాలా అరుదుగా చేశారు. అటువంటి మంత్రిగా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను మొత్తం ఆ వ్యవస్థ అంతా కాపాడుకోవాలి, చాలా కఠినంగా పని చేసేవాడిని. అప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పని చేయడం వల్ల నాకు సులభం అయిపోయేది. నాకు ఎందుకో తొలిసారి ఛాంబర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి అనిపించింది. నాటి మాయాబజార్ చిత్రంలో రేలంగి గారి పాత్ర వేయడం చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది.
Also Read :Dhurandhar 2: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్… అన్ స్టాపబుల్ బాక్సాఫీస్ ‘ధురంధర్’ రివెంజ్!
Also Read
ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నాను. ఆ చిత్రాలలో నా పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి. నా తొలి చిత్రాలలో నా నటన చూసి అందరూ నన్ను మరింత ప్రోత్సహించారు. నాకు వివిధ చిత్రాలలో వివిధ పాత్రలు ఇచ్చి, నన్ను నా దర్శకులు మంచి నటుడుని చేశారు. ఎంతో మందికి సేవలు చేశాను, చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను. రాజకీయాలకు దూరం అయిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి, సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాను. ఇలా చేస్తున్నందుకు, మీ అందరితో కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా రేలంగి గారి ఇంటి వద్ద బాణసంచారాలు పేలాయి అనే విషయం తెలిసిన సంతోషం. నాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి, అంతకంటే ప్రజల ఆశీస్సులే నాకు గొప్ప దీవెనగా తీసుకుంటాను. ఇక పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు” అన్నారు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?