అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం వచ్చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వారి కుటుంబంతో కలిసి 2022 నూతన సంవత్సరాన్ని దుబాయ్ లో జరుపుకున్నారు. ఇక్కడ మహేష్ కుటుంబం మొత్తం కలిసి ఆనందకరమైన విందును ఆస్వాదించినట్లు తెలుస్తోంది. అభిమానులకు వారి సన్నిహిత విహారయాత్ర గురించి స్నీక్ పీక్ ఇవ్వడానికి మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా విషెస్ చెప్పారు. మహేష్ ఆ పోస్టులో “నూతన ప్రారంభాల మేజిక్ ను నమ్మండి! సంతోషంగా ఉండండి, దయతో ఉండండి, కృతజ్ఞతతో ఉండండి! నూతన సంవత్సర శుభాకాంక్షలు #2022! అందరూ సురక్షితంగా ఉండండి. మీ అందరిపై అభిమానంతో” అంటూ మహేష్ ఫ్యామిలీ ఫోటోను పంచుకున్నారు. ఆ పిక్ లో సూపర్ స్టార్ కుటుంబం చిరునవ్వులు చిందిస్తోంది. ఫోటోను చూస్తుంటే ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా గడిపినట్లు తెలుస్తోంది.
ఇక గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో అలరించిన మహేష్ బాబు ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ బ్యాంకు అధికారి, వడ్డీ వ్యాపారి పాత్రను పోషించనున్నారు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట’లో మహేష్ సరసన కీర్తి సురేష్ కూడా నటిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా చెప్పబడుతున్న ‘సర్కారు వారి పాట’ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది.