మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా “ఆచార్య”. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ‘ఆచార్య’ చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ‘ఆచార్య’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నారట.
Read Also : VD11 : విజయ్ దేవరకొండ, సామ్ మూవీ గ్రాండ్ లాంచ్
“ఆచార్య”కు మహేష్ మాట సాయం చేయబోతున్నాడట. అంటే ఈ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని, మహేష్ వాయిస్ తోనే సినిమా ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీలో క్రేజీ బజ్ నడుస్తోంది. ఈ వార్త గురించి చిత్ర బృందం కూడా అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు మహేష్ కు థ్యాంక్స్ కూడా తెలిపింది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై శ్రీమతి సురేఖ కొణిదెల ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మునిగిపోయారు “ఆచార్య” మేకర్స్.
Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2022