Mahesh Babu: ‘శ్రీమంతుడు’ ఒక్కటే కాదు.. ‘మహర్షి’ కూడా నా నవలకి కాపీనే… రచయిత సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu’s Maharshi Film is also copy to my novel says Sarath Chandra: RD విల్సన్, అలియాస్ శరత్ చంద్ర ఇప్పుడు తెలుగులో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు (2015) సినిమా చేశాడని ఆరోపించడమే కాదు రచయితల సంఘం నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకున్నాడు. 2012లో స్వాతి మ్యాగజైన్‌లో ప్రచురితమైన తన రచన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలకి మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా పూర్తి కాపీ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలుగు సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు, ఇక ఈ క్రమంలో రెండు కథలను విశ్లేషించిన తర్వాత, శ్రీమంతుడు కోర్ ప్లాట్ ఈ నవల నుంచి కాపీ చేయబడిందని నిర్ధారించారు. అనేక వాయిదాల అనంతరం ఈ కేసు ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది.
Sundaram Master Trailer: పరీక్ష ఫెయిల్ అయితే ఉరి వేయడం ఏంట్రా.. ఏ ఊర్రా అది
Also Read
- January 12 Vidudala: సైలెంట్గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
అక్కడ న్యాయమూర్తులు కూడా కాపీరైట్ ఉల్లంఘన నిజమే అని తేల్చింది. ఇక కొరటాల శివపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని కూడా పేర్కొంది. ఇక ఇప్పుడు, అదే రచయిత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా తన మరో రచన ‘సమహారం’కి సీన్-టు-సీన్ కాపీ అని ఆరోపించారు. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా మహర్షి (2019)లో రిలీజ్ అయింది. శ్రీమంతుడు సమస్య పరిష్కారం కాగానే ఆ సినిమా రచయితలు వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలమన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శరత్ చంద్ర పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే ‘సూపర్ స్టార్’ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఆయన గత సినిమాల మీద కాపీ మరకలు పడుతూ ఉండడం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!