ఇటీవల ‘సర్కారువారి పాట’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ టీజర్‌ను మే 31 న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటానికి దర్శకుడు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్‌కు అచ్చివచ్చిన ‘అ’ సెంటిమెంట్‌ను ఈ సినిమాకు అనుసరించి ఈ మూవీకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘ఒక్కడు, దూకుడు’లో…