MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..

  • ఫ్లైట్ లో స్టాఫ్ తో మహేశ్
  • ఎందుకు వెళ్లాడబ్బా
  • హైదరాబాద్ లోనే జక్కన్న
Maheshbabu

Maheshbabu

MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబు కొలంబోకు వెళ్లారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో వెళ్తున్న మహేశ్ బాబుతో ఎయిర్ లైన్స్ స్టాఫ్‌ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను తాజాగా శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్ ఇండియన్ సినిమా స్టార్ తమ ఫ్లైట్ లో జర్నీ చేయడం తమకు సంతోషంగా ఉందని తెలిపింది. ఆయనను రిసీవ్ చేసుకోవడం తమకు గర్వకారణం అంటూ పేర్కొంది. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Prabhas : ప్రభాస్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇందులో మహేశ్ క్యాప్ పెట్టుకుని చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మహేశ్ ఇలా బయట కనిపించాడు. అయితే కొలంబోకు ఎందుకు వెళ్లాడనేది మాత్రం తెలియలేదు. చూస్తుంటే రాజమౌళి సినిమా షూట్ కోసం ఏమైనా వెళ్లాడా అనే టాక్ వినిపిస్తోంది. కానీ దానిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రాజమౌళి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్తున్నాడు. అటు మహేశ్ ఒంటరిగానే కొలంబో వెళ్తున్నట్టు మనకు ఫొటోల్లో కనిపిస్తోంది. కాబట్టి మహేశ్ బాబు ఎందుకు వెళ్లాడనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..