Mohanbabu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. చాలా ఏళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధ పడ్డ కోట.. చివరకు జులై 13న తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోతే ఇండస్ట్రీ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర నటీనటులు వచ్చి నివాళి అర్పించారు. కానీ కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు మాత్రం రాలేదు. ఆయన రాకపోవడంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. నేడు మోహన్ బాబు కోట ఇంటికి వెళ్లి ఆయన ఫొటోకు నివాళి అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేను కోట శ్రీనివాస్ ఎంతో ఆత్మీయులం. ఆయనకు నాకు ఎంతో అనుబంధం ఉంది.
Read Also : Rashmika : భారీ బిజినెస్ పెట్టిన రష్మిక
కోట చనిపోయినప్పుడు నేను ఊరిలో లేను. విదేశాల్లో ఉన్నాను. అందుకే ఆ రోజురాలేకపోయాను. దానికి నాకు బాధగా ఉంది. కోట శ్రీనివాస్ నేను ఎన్నో సినిమాల్లో నటించాం. ఎలాంటి డైలాగ్ అయినా కమెడియన్ గా, విలన్ గా రకరకాల స్లాంగ్స్ లలో చెప్పగలిగే నటుడు కోట శ్రీనివాస్ మాత్రమే. ఆయన లేని లోటును ఇండస్ట్రీలో ఎవరూ తీర్చలేరు. ఆయన కుటుంబం మా కుటుంబానికి ఎంతో దగ్గర. చాలా సార్లు అందరం కలిసి గడిపాం. ఇప్పుడు ఆయన లేకపోవడం చాలా బాధాకరం అంటూ ఎమోషనల్ అయ్యారు మోహన్ బాబు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు రీసెంట్ గానే కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా అనుకున్నంత రాబట్టలేకపోయింది.
Read Also : Sukumar : సుకుమార్ లెక్కలను ఫాలో అవుతున్న డైరెక్టర్లు..!