SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్‌కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu to take special training for Rajamouli Film: మహేష్ బాబు ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ సీతా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని నాగ వంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని భీష్మించుకుని కూర్చున్న సినిమా యూనిట్ వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్రయత్నాలు అయితే జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు.
Kushitha kallapu: బజ్జీల పాపకి గురూజీ బంపర్ ఆఫర్.. ఏకంగా మహేష్ తోనే?
Also Read
ఇప్పటివరకు ఈ సినిమా కథ ఒక కొలిక్కి రాలేదు కానీ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా కథ ఉండే అవకాశం ఉందని సినిమాకి కాదు అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ అయితే లీకులు ఇచ్చారు, ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు మహేష్ బాబు ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కోసం వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబు టీంకి సమాచారం ఇచ్చారని దాదాపు మూడు నెలలపాటు ఈ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ బాబుతో రాజమౌళి ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు అనే ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి చూడాలి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టి ఎంత కలెక్షన్స్ వసూలు చేయబోతుంది అనేది.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!