‘సర్కారు వారి పాట’ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని సమ్మర్ లో రాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు కూడా. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలతో పాటు కొంత యాక్షన్ పార్ట్ షూటింగ్ మిగిలి ఉంది. వీటితో పాటు కొంత భాగాన్ని రీషూట్ చేయటానకి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహేశ్ మోకాలి సర్జరీ కోసం యు.ఎస్ వెళ్ళనున్నట్లు వార్తలు వినిపించాయి. మైనర్ ఆపరేషన్ అని వినిపిస్తున్నప్పటికీ దానికోసం అమెరికా వెళ్ళవలసిన పనేంటి అనే వారు లేకపోలేదు. ఇప్పుడు అదే ‘సర్కారు వారి పాట’ మేకర్స్ ని టెన్షన్ పెడుతోందట. ఆపరేషన్ తర్వాత మహేశ్ ఓ రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు ఏప్రిల్ 1కి రిలీజ్ అవుతుందా! అన్నదే ప్రశ్న. అన్నీ సక్రమంగా జరిగితే మార్చిలో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి అనుకున్న డేట్ కి వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఏదైనా అటు ఇటు అయితే ఏప్రిల్ నెలాఖరుకు వెళ్ళాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇది మొత్తానికి మహేశ్ గాయ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మరి మహేశ్ గాయం తీవ్రత ఎంత? కోలుకోవటానికి ఎంత టైమ్ పడుతుంది. అనుకున్నట్లుగా ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1కి వస్తుందా!? వీటన్నింటికి జవాబు దొరకాలంటే మహేశ్ గాయం తీవ్రత ఏమిటో తెలియాల్సి ఉంది. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.