Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ చెన్నై నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను చూసుకున్నారు. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. రజినీకాంత్ బెంగుళూరులో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యనారాయణ రావు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Read Also : Anchor Suma : మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్
అప్పటి నుంచి ఆయన తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, వైద్యులు మరికొన్ని రోజులపాటు ఆస్పత్రిలో ఉంచి అబ్జర్వ్ చేయాలని చెప్పారు. రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన అన్నయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న జైలర్-2తో పాటు మరో సినిమా షూటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.
Read Also : Actor Janardhan : 18 ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా.. నా భార్య సపోర్ట్ చేసింది