“ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఎవరు మీలో కోటేశ్వరులు” మొదటి సీజన్ త్వరలో పూర్తి కానుంది. ఇందులోని స్పెషల్ ఎపిసోడ్స్ కు తప్ప ఇప్పటి వరకూ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ షోకు సంబంధించిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. షో టిఆర్పి రేటింగ్స్ ను పెంచడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు మేకర్స్. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను రంగంలోకి దింపిన “ఎవరు మీలో కోటేశ్వరులు” మేకర్స్ త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా, ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయబోతున్నారు.
Read also : ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో ‘నాన్ వరువేన్’
Also Read
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
- Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
- Varun Tej: 'బరి'లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
- SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. మహేష్, ఎన్టీఆర్ ఇద్దరూ ఫ్రేమ్‌లో అద్భుతంగా కన్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, ఎన్టీఆర్ మధ్య చాలా సరదా సంభాషణ జరిగినట్టు సమాచారం. మహేష్ బాబు ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో 25 లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 19) ఎపిసోడ్‌ని షూట్ చేసారు. మేకర్స్ ఈ స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే “ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఎన్టీఆర్, మహేష్ కాంబినేషన్ లో వచ్చే స్పెషల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం అవుతోంది.
తాజావార్తలు
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!