ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో ‘నాన్ వరువేన్’

యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మారన్’. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ‘ధ్రువ పదహారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్ ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈరోజు అద్వితీయమైన థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుల జాబితాలో చేరిపోయాడు. దీంతో ‘మారన్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది పొంగల్‌కు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also : అక్కినేని ఫ్యాన్స్ కు “బంగార్రాజు” ట్రీట్… వరుస అప్డేట్స్

దీంతో ఒక్కసారిగా ధనుష్ అభిమానులు ‘మారన్‌’ను థియేటర్లలోనే విడుదల చేయాలి అని ట్విట్టర్‌లో పట్టుబడుతున్నారు. గతంలో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ ఓటీటీలో విడుదలైనప్పుడు, ధనుష్ తనకు సినిమా ఓటిటీలో విడుదల కావడం ఏమాత్రం ఇష్టం లేదని ట్వీట్ చేశాడు. దీంతో ‘మారన్’ చిత్రం ఓటీటీలో ఖచ్చితంగా విడుదల కాదని భావించారు. అయితే తాజాగా లీక్ అయిన సమాచారంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో ధనుష్ అభిమానులు ‘మారన్‌ను థియేటర్లలో విడుదల చేయాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. కాగా ధనుష్ నెక్స్ట్ మూవీ “నానే వరువేన్”. ధనుష్, దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించనున్నారు.

ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో 'నాన్ వరువేన్'

Related Articles

Latest Articles