Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు, సితార ఈ నడుమ బాగా ట్రెండ్ అవుతున్నారు. మహేశ్ బాబు తన కూతురు సితారతో కలిసి ఎక్కువగా ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. మొదటిసారి తన కూతురుతో కలిసి మొన్ననే ట్రెండ్స్ కంపెనీ యాడ్ లో నటించారు. ఆ యాడ్ బాగా వైరల్ అయింది. ఇందులో సితార తెలుగులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఆ యాడ్ షూటింగ్ కు సంబంధించిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మహేశ్ బాబు, సితార కలిసి దిగిన స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
Read Also : AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా రెడీ..!
ఇందులో మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా యంగ్ గా కనిపిస్తున్నారు. ఆయన గడ్డం, మీసాలతో షార్ప్ గా ఉన్నారు. సితార కూడా ఫ్యాషన్ ఐకాన్ లాగా డ్రెస్ వేసుకుని కనిపిస్తోంది. తండ్రికి తగ్గ కూతురు అంటూ ఈ ఫొటోలను ఆయన ఫ్యాన్స్ పోస్టు చేస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రీసెంట్ గానే ఒడిశా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాని తర్వాత ఎక్కడ షూటింగ్ చేస్తారనేది త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.