కొత్త ఏడాది కొత్త రికార్డు సెట్ చేసిన మహేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఈ హ్యాండ్సమ్ హీరో కొత్త ఏడాది కొత్త హిస్టరీ సృష్టించాడు. ట్విట్టర్‌లో రికార్డు సృష్టించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు మహేష్. న్యూఇయర్ ప్రారంభం సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్న మహేష్ ట్విట్టర్‌లో దుబాయ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అభిమానులందరికి న్యూఇయర్ విషెస్ తెలియజేస్తూ అందరూ దయతో, కృతజ్ఞతతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో సంచలనం సృష్టించింది.
Read Also : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… అసలు విషయం చెప్పేసిన మేకర్స్
Also Read
మహేష్ ఒక్క ట్వీట్ కే లక్షకు పైగా లైక్ లు రావడం విశేషం. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే 1 లక్షకు పైగా లైక్‌లను పొందిన మహేష్ 31వ ట్వీట్ ఇది. సోషల్ మీడియాలో ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక భారతీయ నటుడు. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్‌లతో కూడా సినిమాలు చేయబోతున్నాడు.
Trust the magic of new beginnings! Be happy, be kind, be grateful! Happy New Year 2022! Stay safe everyone. Love you all ❤️🤗 pic.twitter.com/imt6vXH0yW
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2021
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!