Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేశ్ బాబుకు అడ్వాన్స్ ఇవ్వడానికి చర్చలు జరిపింది. కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా ఏషియన్ సునీల్ మహేశ్ బాబు దగ్గరకు ఓ మాసివ్ లైనప్ వెళ్లినట్టు తెలుస్తోంది.
Read Also : Manchu Lakshmi : మంచు లక్ష్మీపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా చేసేందుకు మహేశ్ బాబు ముందు ప్రపోజల్ పెట్టాడంట సునీల్. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ లోనే సందీప్ కు ఏషియన్ సునీల్ అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మహేశ్ బాబు, సందీప్ రెడ్డి కాంబోలో ఓ భారీ మాసివ్ సినిమాను తీయాలని ప్లాన్ చేస్తున్నారంట ఏషియన్ సునీల్. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే మహేశ్ బాబు నుంచి అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మహేశ్ బాబు వద్ద మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సంస్థలు తమ ప్రపోజల్స్ ఉంచాయి. కానీ మహేశ్ బాబు అప్పుడే నిర్ణయం తీసుకోవద్దని ఆలోచిస్తున్నాడంట. రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యాక.. అప్పటి తన మార్కెట్ రేంజ్, ఫ్యాన్ బేస్ ను బట్టి ఓ సాలీడ్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడంట. కానీ సందీప్ సినిమాను ఓకే చేస్తే మహేశ్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.
Read Also : OG : భారీ ట్విస్ట్.. ఓజీ సినిమాలో ప్రకాశ్ రాజ్..