Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పలు రకాల డిఫరెంట్ షేడ్స్, వైవిధ్యమైన గెటప్‌లలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవలే ఒక గ్లోబల్ స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్ని షేడ్స్‌లో కనిపించినప్పటికీ.. ‘శ్రీరామచంద్రుని’ అవతారంలో వచ్చే దృశ్యాలు మాత్రం థియేటర్లలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని, అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
అయితే తాజాగా ఈ గెటప్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. వారణాసి షూటింగ్ సెట్స్ నుంచి మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న ఫోటో అంటూ నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో చాలామంది ఫ్యాన్స్ ఇది నిజంగానే సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన ఒరిజినల్ పిక్ అని నమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ఈ వైరల్ పిక్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే.. అది సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన అధికారిక ఫోటో కాదట. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో క్రియేట్ చేసిన ఫ్యాన్ మేడ్ ఫోటో. ఆ చిత్రాన్ని నిశితంగా గమనిస్తే అది ఏఐ జనరేటెడ్ పిక్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి, లీక్‌ల విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్స్, లీక్స్ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఈ రాముడి గెటప్ ఫోటో మాత్రం వంద శాతం ఫేక్ అని తేలిపోయింది.
Also Read
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!