Site icon NTV Telugu

SSMB 29 : GlobeTrotterపై ప్రియాంక చోప్రా స్పెషల్ వీడియో..

Priyanka Chopra

Priyanka Chopra

SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్”. ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే టాలీవుడ్ అంతా దృష్టి పెట్టగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఒక వీడియో ద్వారా అభిమానుల ఆసక్తిని మరింత పెంచేశారు.

Read Also : SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్

తాజాగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ “నేనెందుకు తరచుగా హైదరాబాద్‌లో ఉంటున్నానో మీకు నవంబర్ 15న తెలుస్తుంది. రాబోయే ఈవెంట్‌లో కలుద్దాం. ఈ స్పెషల్ వేడుక జియో హాట్‌స్టార్‌లో లైవ్‌గా ప్రసారం అవుతుంది” అంటూ తెలిపింది. మొన్ననే మహేశ్ బాబు కూడా స్పెషల్ వీడియో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇలా ఒక్కొక్కరు స్పెషల్ వీడియోతో ఈ ఈవెంట్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ లో టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Read Also : Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

Exit mobile version