సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ చేయనున్న సినిమా ముగిసిన అనంతరం.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పట్టాలెక్కడానికి చాలా సమయమే ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇంతవరకూ మన ఇండియాలో హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఏదంటే.. అది 2.0! ఈ చిత్రం అక్షరాల రూ. 550 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది. అంతకుమించిన బడ్జెట్‌తో మహేశ్ సినిమాని జక్కన్న తెరకెక్కించబోతున్నాడట! ఆర్ఆర్ఆర్ సినిమా తనకు అంతర్జాతీయ క్రేజ్ తెచ్చిపెట్టిన నేపథ్యంలో.. మహేశ్ సినిమాను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాడట! ప్రపంచం మెచ్చే విజువల్ వండర్‌గా రూపొందించాలని పెద్ద స్కెచ్ వేస్తున్నాడట! బడ్జెట్ ఫిగర్ ఎంత అనేది ఇంకా పక్కాగా వెలుగులోకి రాలేదు కానీ, 2.0 కంటే మించి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. ఇది దేశంలోనే కాస్ట్లీయస్ట్ మూవీగా అవతరించనుంది.
అయితే.. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం ఇంతవరకు ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అవ్వలేదు. ఆఫ్రికన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో విజయేంద్ర ప్రసాద్, జక్కన్న ఇంకా స్టోరీని డెవలప్ చేసే పనిలో ఉన్నారట! కథ కొలిచ్చి వచ్చిన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని మొదలుపెట్టనున్నారని, అనంతరం సరైన ముహూర్తం చూసుకొని షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2023 ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.