సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ చేయనున్న సినిమా ముగిసిన అనంతరం.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పట్టాలెక్కడానికి చాలా సమయమే ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతవరకూ…