అందాల రాక్షసికి బంపర్ ఆఫర్… మహేష్ తో రొమాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మహేష్ తో రొమాన్స్ చేయనుందని అంటున్నారు. కథలో రెండవ హీరోయిన్ కు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో మహేష్ సలహా కారణంగా లావణ్య త్రిపాఠిని ఈ ప్రాజెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారట మేకర్స్.
Read Also : కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
ఈ వార్తలు గనుక నిజమైతే లావణ్య త్రిపాఠి, మహేష్ బాబు కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. అలాగే టాప్ తెలుగు స్టార్‌తో కలిసి లావణ్య చేయబోయే మొదటి భారీ బడ్జెట్ చిత్రం కూడా ఇదే అవుతుంది. లావణ్య త్రిపాఠికి ఇది అద్భుతమైన ఛాన్స్ అనే చెప్పాలి. అందం, అభినయం ఉన్నప్పటికి లావణ్యకు ఇప్పటి వరకూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”, త్రివిక్రమ్ శ్రీనివాస్ “భీమ్లా నాయక్”తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల కోసం వారు కోసం ఇచ్చిన కమిట్మెంట్స్ ను పూర్తి చేసి త్వరలో సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!