కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్

1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి.

ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు. దేశానికి భిక్షగా స్వాతంత్య్రం వచ్చిందని కంగనా రనౌత్ అనే మహిళ చెప్పినట్లు వార్తలు పదే పదే ప్రసారం కావడం చూశాను. ఆ మహిళకు రాష్ట్రపతి పద్మశ్రీ అందజేశారు. అది చూసిన తర్వాత నాకు విపరీతమైన కోపం వచ్చింది.నాకు 12 ఏళ్ల వయసులో గాంధీజీతో పాటు ఇంగ్లీషు విద్యను బహిష్కరించాలని డిమాండ్ చేసి ఒకరోజు జైలుకు వెళ్లాను. మాలాంటి వ్యక్తులు దాని కోసం శ్రమించిన, మేము చూసిన, మేము అనుభవించిన ప్రజల త్యాగాన్ని గుర్తించకుండా, ఈ మహిళ ‘భిక్ష’తో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పింది. ఈ ప్రకటనను నేను ఖండిస్తున్నాను. ఆమెకు బుద్ధి చెప్పాలని నేను మన గౌరవనీయమైన ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. ఆమెను జైలులో పెట్టమని నేను మిమ్మల్ని అడగడం లేదు, కానీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. దీన్ని దేశద్రోహం అంటారు. భిక్షతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని యువతకు చెబితే, వారు దాని గురించి ఏమనుకుంటారు? దేశ భవిష్యత్తు ఏమిటి? కాబట్టి ఈ ఆలోచన వ్యాప్తి చెందకుండా, ఆమెపై చర్య తీసుకోవాలి’ అంటూ ఆమె ప్రధానిని డిమాండ్ చేశారు.

Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ

కొన్ని రోజుల క్రితం ఓ మీడియా ఇంటరాక్షన్ లో కంగనా మాట్లాడుతూ.. భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే లభించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై మండిపడుతూ పలువురు రాజకీయ నాయకులు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ప్రకటన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులందరి త్యాగాలను అవమానించేలా ఉందని, ఆమెకు ఇటీవల లభించిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తనను తాను సమర్థించుకుంది. తాను తప్పు అని నిరూపిస్తే తన పద్మశ్రీని తిరిగి ఇస్తానని సవాల్ చేసింది. కంగనా పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పటి నుంచి జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు, ఎలా సద్దుమడుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles