Mahesh Babu: ఘట్టమనేని కుటుంబానికి 2022 కలిసిరాలేదు అని చెప్పొచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబుకు ఈ ఏడాది ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయాడు. మొదట అన్న రమేష్ ను, తరువాత తల్లి ఇందిరా దేవిని ఇక ఇప్పుడు తండ్రి కృష్ణను మహేష్ కోల్పోయాడు. దీంతో ఆయన బాధకు అంతు లేకుండా పోయింది. మహేష్ పెదాలపై ఎప్పుడు చిరునవ్వును మాత్రమే చూసిన అభిమానులు ఇప్పుడు ఆయన కంట నుంచి వచ్చే నీరును చూడలేకపోయారు. తన తండ్రే తన దేవుడు అని తండ్రిపై ఉన్న ప్రేమను సమయం వచ్చినప్పుడల్లా చెప్పే మహేష్.. ఇప్పుడు ఆ తండ్రి లేడు.. ఇక రాడు అని తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు.
అసలు మహేష్ ను ఆపడం ఎవరి వలన కావడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అందరి ముందు ఆ కన్నీళ్లను దిగమింగుకొని వచ్చేపోయేవారితో మాట్లాడుతూ ఉన్నా.. మహేష్ కళ్ళలో నీళ్లు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా మహేష్ ను చూసిన అభిమానులు సైతం కంటనీరు పెడుతున్నారు. అన్నా.. నువ్వు దైర్యంగా ఉండు.. నీకు మేము అందరం తోడుగా ఉంటాం అని దైర్యం చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ కన్నీరు పెడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Annaaa💔😢 pic.twitter.com/Phy5bPf9iC
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 15, 2022