Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట విషాదం జరిగిన విషయం విదితమే. రెండు నెలల ముందు తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన మహేష్.. నిన్న తండ్రి కృష్ణను కోల్పోయాడు. దీంతో మహేష్ క్రుంగిపోయాడు. దేవుడిలా కొలిచే తండ్రిని పోగొట్టుకోవడంతో మహేష్ దుఃఖానికి హద్దే లేకుండా పోయింది. తల్లి చనిపోయినప్పుడు కొన్నిరోజులు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన మహేష్ ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని చూసుకున్నాడు. ఇక అదే విధంగా మరోసారి మహేష్ షూటింగ్స్ కు బ్రేక్ చెప్పనున్నాడట. తండ్రి అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వెళ్లిన మహేష్ కొన్నిరోజులు ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నాడట. అంతే కాకుండా తండ్రి చితికి నిప్పుపెట్టింది మహేషే కాబట్టి ఆయన పెద్దకర్మ అయ్యేవరకు మహేష్ బయటకి వెళ్లకూడదట. ఇవన్నీ ఆలోచించే మహేష్ తన సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.
ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే అత్యధికంగా నష్టపోయేది మాత్రం త్రివిక్రమ్ అని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లో త్రివిక్రమ్- మహేష్ సినిమా మొదలయ్యింది. ఇక ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో తల్లి మరణంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ మధ్యనే సెట్ లో మహేష్ అడుగుపెట్టాలని చూస్తుండగా.. ఇప్పుడు కృష్ణ మరణంతో మరోసారి సినిమా వాయిదా పడింది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా వచ్చేసరికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది అని అంటున్నారు అభిమానులు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.