Mahesh Babu: హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Birthday Special: సూపర్ స్టార్.. ఈ పేరును వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలా కాలం పట్టింది. కాదు చాలా కష్టపడ్డాడు. తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది. కానీ ఆ ఇమేజ్ రావాలంటే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి తర్వాత ఆ టైటిల్ అతనికి యాప్ట్ అనేశారు కూడా. అది నిజమే అని ప్రతి సినమాతో ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ రాజకుమారుడి పుట్టిన రోజు ఇవాళ.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా.. అన్నయ్య రమేష్ బాబు నటించిన నీడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత పోరాటం, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢ ఛారి117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి సినిమాలు చేశాడు మహేష్. అన్ని సినిమాల్లోనూ చాక్లెట్ బాయ్ లుక్స్ తో తండ్రికి తనయుడుగా చిచ్చరపిడుగు అనిపించుకున్నాడు.
Mahesh Babu: సూర్య భాయ్ కి జేజేలు కొడుతున్నారు… ఈ బర్త్ డేని ఇలా కానిచ్చేయండి
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
అయితే సినిమాల వల్ల మహేష్ చదువు పాడవుతుందని, చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావచ్చు అంటూ మహేష్ ని కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంచారు కృష్ణ . అయితే మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చార్మినార్ సెట్టింగ్ ఓ హైలెట్ అయితే, మహేష్ బాబు పెర్ఫామెన్స్ మరో హైలెట్. కబడ్డీ ప్లేయర్ లా యూత్ రిప్రజెంటేటివ్ గా కనిపించిన మహేష్ బాబు యాక్టింగ్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఇక అప్పటి వరకు కృష్ణ అభిమానులే ప్రిన్స్ ఫ్యాన్స్ అన్న లైన్ పోయి, తనకంటూ సొంత ఫాలోయింగ్ ని మహేష్ కి ఏర్పడిందీ ఒక్కడు సినిమాతోనే. హిట్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ వచ్చినా అధైర్య పడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి. అభిమానులంతా గర్వపడేలా, స్టార్ వార్ లో దుమ్ముదులిపేలా ఓ హిట్ కావాలి. అది ఫలానా హీరోకి ఫలానా సినిమా ఉందే.. అలా అని అంతా అనుకునేలా ఉండాలి.. అనుకుంటున్న టైమ్ లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైమ్ కు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేసులో నిలిపింది పోకిరి..పోకిరి దెబ్బకు రికార్డుల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది.
ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో మహేష్ ఈ సారి ప్రయోగాలు చేయకుండా ఈసారి మాస్ బాట పట్టాడు. దూకుడు మూవీతో వచ్చి దుమ్ము దులిపాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దూకుడులో పోలీస్ ఆఫీసర్ గా, ఎమ్మెల్యేగా సరికొత్త లుక్ తో తన పెర్ఫార్మెన్స్ కట్టిపడేశారు మహేష్. ఈ మూవీతో చాలా వరకూ తన రికార్డులు తనే బద్దలు కొట్టాడు. నిజానికి ముందు నుంచి మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ, స్టోరీనే నమ్మాడు. తన చుట్టే సినిమా అంతా తిరగాలని అనుకోలేదు. తొలినాళ్లలో అలా చేసినా.. తర్వాత ప్రతి విజయంతో కథకే ఇంపార్టెన్స్ ఇవ్వడం పెంచాడు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. టాలీవుడ్ లో 20 ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్ తో ఆ రోజుల్లో కృష్ణ గారు చేసిన మల్టీస్టారర్స్ ను నాటి తరం ప్రేక్షకులకు మరోసారి గుర్తు వచ్చేలా చేశాడు.ఇక ఆ తరువాత రెండు ఫ్లాపులు రావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్సు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు మహేష్ బాబు.
ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించి షూటింగ్స్ ని పోస్ట్ పోన్ చెయ్యడంతో మహేష్ భయపడుతున్నాడనే టాక్ వచ్చింది. కానీ ఎవరేమన్నా పట్టించుకోలేదు. ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలనే డిసైడ్ అయ్యాడు. కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడులా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. 150 కోట్లకు పైగా కలెక్షన్లతో టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ లో చేరిన రెండో హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు మహేశ్. ఆ వెంటనే భరత్ అనే నేను, మహర్షితో రెండు భారీ హిట్లు ఇచ్చిన మహేష్.. తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో హాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నటించిన మహేష్… యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీతో పాటు డాన్సుల్లోనూ జోష్ చూపించి అభిమానులననే కాదు అందర్నీ మెస్మరైజ్ చేశారు. 2020 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ పోటీగా అల వైకుంఠపురములో అనే మరో సినిమా ఉన్నప్పటికీ 250 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. మహేష్ బర్త్ డే సందర్భంగా ఇవాళ బిజినెస్ మాన్ మూవీ 4కె వెర్షన్ ని రీ రిలీజ్ చేశారు. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉన్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సంధర్భంగా ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!