Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas-Hanu Raghavapudi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి మధ్య క్రియేటివ్ బాండింగ్ మరింత బలపడినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ‘ఫౌజీ’ తర్వాత కూడా ఈ కాంబినేషన్ కొనసాగుతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి ‘ఫౌజీ’ని తెరకెక్కిస్తున్న విధానం, ఆయన వర్కింగ్ స్టైల్ ప్రభాస్‌ను ఆకట్టుకున్నట్లు చెబుతున్నారు. ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల సెట్స్‌లోనూ.. ‘ఫౌజీ’ విషయంలో డైరెక్టర్ పనితీరును ప్రశంసిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి డార్లింగ్ ఆయనతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత హను రాఘవపూడితో మరో కథ చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కించే అవకాశం ఉందట. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇదిలా ఉంటే.. ‘ఫౌజీ’ స్టోరీకి ప్రీక్వెల్ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో పరిశీలించవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ, పాత్రలకు ఉన్న స్కోప్‌ను బట్టి ప్రీక్వెల్‌కు అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అయితే దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్-హను కాంబినేషన్లో వస్తున్న ‘ఫౌజీ’పై భారీ హైప్ ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమా తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి పనిచేస్తారనే వార్త నిజమైతే డార్లింగ్ అభిమానులకు అది మరింత క్రేజీ కాంబినేషన్‌గా మారనుంది. డిసెంబర్ 3న ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
తాజావార్తలు
-
Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
-
Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Electric Aircraft: వరల్డ్‌లో తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం.. ఖర్చెంతో తెలుసా?
-
Green Chilli Plant: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే పచ్చిమిర్చి సాగు.. 2 నెలల్లో కాయలు గ్యారంటీ!
-
BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!