టాలీవుడ్ టాప్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల తన కూతురు సితారతో కలసి డాన్స్ ఇండియా డాన్స్ లో కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా మహేశ్ సినిమా ప్రమోషన్ లోనే కనపించటం గొప్ప. ఆర్ధిక ప్రయోజనం లేనిదే మహేశ్ ఏ పని చేయడు. ఇప్పుడు డాన్స్ షో వెనుక కూడా అదే రీజన్ ఉంది. ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్ సాంగ్ పెన్నీ పాటతో సందడి చేసిన సితార ఇప్పుడు జీ తెలుగు వారి డాన్స్ ఇండియా డాన్స్ లో కూడా అదే పాటలో నర్తించింది. అందులోనే మహేశ్ కనిపిస్తారు. ఇక మహేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న గుర్తింపు ఎలాంటిదో అందరికీ తెలిసిందే. పలు కార్పోరేట్ సంస్థలకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్ రియల్ ఎస్టేస్ కంపెనీలకే కాదు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. మన స్టార్ హీరోల్లో బ్రాండ్స్ వాల్యూ విషయంలో మహేష్ బాబు ముందు వరుసలో నిలుస్తాడు. డెన్వర్, సాయి సూర్యా డెవలాపర్స్, మౌంటేయిన్ డ్యూ, బైజూస్, ఇంటెక్స్, పాన్ బహార్, అభీ బస్ వంటి బ్రాండ్స్ తో పాటు మ్యాట్రిమోని సైట్స్ కూడా మహేశ్ ఖాతాలో ఉన్నాయి. వీటి ద్వారా కోట్లాది పారితోషికం సొంతం చేసుకుంటున్నాడు మహేశ్.
ఇదిలా ఉంటే మహేష్ మరోసారి ఈ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. గతంలో 2 కోట్ల డీల్ తో జీ వారి భారీ ఈవెంట్ కు హాజరు అవడమే కాదు ఆ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ కి కూడా ప్రచారం చేశారు. తాజాగా అదే ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మరోసారి సైన్ చేశారు. అయితే ఈ సారి మహేశ్ 9 కోట్లు అందుకోబోతున్నాడట. ఆ ఒప్పందంలో భాగంగానే రియాలీటీ షోస్, టీవీ సీరియల్స్ తో పాటు జీ తెలుగువారి పలు ప్రోగ్రామ్స్ కు మహేష్ ప్రచారం చేయాల్సి ఉంది. ఈ డీల్ ఓ సంవత్సరం పాటు కొనసాగనుంది. అందుకే కూతురు సితార తో కలిసి డ్యాన్స్ షోలో మహేష్ పాల్గొన్నాడు మహేశ్. ఇక త్రివిక్రమ్ తో మహేష్ చేయబోతున్న ప్రాజెక్ట్ సెప్టెంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కాబోతోంది. తొలి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించనున్నారు.