Divvela Madhuri : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం బాగానే నడుస్తోంది. నిన్న ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక విషయాలను పంచుకుంది. హౌస్ లోకి వెళ్లిన శ్రష్టి వర్మ మొదటి వారానికే బయటకు వచ్చింది కదా.. ఆమెకు ఓ కొరయోగ్రాఫర్ విషయంలో జరిగిన గొడవల వల్ల ఓటింగ్ సరిగ్గా రాలేదు. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురయితే ఎలా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. శ్రష్టి వర్మ పరిస్థితులు వేరు.. మా పరిస్థితులు వేరు. ఆమెను క్రిటిసైస్ చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు.
Read Also : Chiranjeevi : చిరంజీవి మూవీ.. కత్తిలాంటి హీరోయిన్లతో బాబీ చర్చలు..
కానీ మమ్మల్ని క్రిటిసైస్ చేయడానికి ఎలాంటి కారణాలు పెద్దగా లేవు. శ్రీనివాస్ లైఫ్ లో ఇబ్బందులు పడి బయటకు వచ్చారు. నేను కూడా నా భర్తతో ఇబ్బందులు పడి ఇష్టంలేక బయటకు వచ్చాను. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇందులో తప్పేముంది. చాలా మంది రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవట్లేదా.. వాళ్లు సినిమాలు చేయట్లేదా, రాజకీయాల్లో ఉండట్లేదా. మమ్మల్ని మాత్రమే ఎందుకు ఇలా అంటున్నారు. మేం ఎవరికీ అన్యాయం చేయట్లేదు. చాలా మందికి పని కల్పిస్తున్నాం. ఎంతో మందికి సాయం చేస్తున్నాం. కాబట్టి నాకు శ్రష్టి వర్మ లాంటి పరిస్థితి రాదు అంటూ తెలిపింది మాధురి.
Read Also : Balakrishna : బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి.. కార్యకర్తల డిమాండ్