Macharla NiyojakaVargam: ఆ వయస్సులో తప్పు చేయడం తప్పు కాదంటున్న నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియోను విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. “చిల్ మారో చిల్ మారో” అంటూ సాగుతున్న ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
మంచి పార్టీ మోడ్ లో నితిన్ చిల్ అవుతున్నట్లు కనిపించాడు. ఇక నితిన్ తో పాటు ఈ సాంగ్ లో క్యాథరిన్ చిందేసింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు కృష చైతన్య క్యాచీ లిరిక్స్ అందించగా.. నకేష్ అజీజ్, సంజన కల్మంజే ఎంతో హుషారుగా ఆలపించారు. లిరిక్స్ ను బట్టి హీరో క్యారెక్టర్ ను తెలిపే సాంగ్ లా కనిపిస్తుంది. ఈ చిన్న వయస్సులో తప్పు కాదులే తప్పు చేయడం.. వేళకాని వేళ ఎందుకంత మోయడం అంటూ సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి గా నటిస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా ఆగస్టు 12 న రిలీజ్ కానుంది. వరుస ప్లాపుల మధ్య ఉన్న నితిన్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్నీ అందిస్తుందో చూడాలి.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
The Music of Macherla begins with #ChillMaaro 😎
Our first single from #MacherlaNiyojakavargam !
Hope you vibe to it as much as i did❤️– https://t.co/wLUuexgfmQ@CatherineTresa1 @IamKrithiShetty @SrSekkhar #MahatiSwaraSagar @SreshthMovies @adityamusic
— nithiin (@actor_nithiin) May 31, 2022
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!