Maa Oori Polimer 2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2 డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 3 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమా మా ఊరి పొలిమేర పార్టు 1కు కొనసాగింపుగా వస్తోంది..విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో రేపు సాయంత్రం 06:30 గంటలకు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన నయా పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మా ఊరి పొలిమేర 2లో గెటప్ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి మరియు రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా రీసెంట్‌గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది…డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సీక్వెల్ తో డబుల్ థ్రిల్ అందించబోతున్నట్టు టీజర్, ట్రైలర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. మా ఊరి పొలిమేర 2 సినిమాను పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేసినట్లు సమాచారం..ఇదిలా ఈ సినిమాకు మూడవ పార్ట్ కూడా ఉండనున్నట్లు ఈ చిత్ర దర్శకుడు వెల్లడించారు.అయితే మూడవ పార్ట్ లో స్టార్ హీరోలు నటించనున్నట్లు దర్శకుడు తెలిపారు.
Also Read
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..